Seethakka: చిన‌జీయ‌ర్ త‌క్ష‌ణ‌మే క్ష‌మాప‌ణ చెప్పాలి: సీత‌క్క డిమాండ్‌

sethakka damends sorry from Chinna Jeeyar Sawmy

  • చిన‌జీయ‌ర్ వ్యాఖ్య‌లు ఎంత‌గానో బాధించాయి
  • నేడు స‌మ్మ‌క్క‌,సార‌ల‌మ్మ‌ల‌ను ద‌ర్శించుకున్న సీతక్క 
  • మేడారంలో ప్రత్యేక పూజ‌లు నిర్వ‌హించిన ఎమ్మెల్యే  

తెలంగాణ ప్ర‌జ‌లు అత్యంత భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో పూజించే స‌మ్మ‌క్క‌, సార‌ల‌మ్మ‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన చినజీయ‌ర్ స్వామి త‌క్ష‌ణ‌మే తెలంగాణ స‌మాజానికి క్ష‌మాప‌ణ చెప్పాలిని కాంగ్రెస్ పార్టీ నేత‌, ములుగు ఎమ్మెల్యే సీత‌క్క డిమాండ్ చేశారు. స‌మ్మ‌క్క‌, సార‌ల‌మ్మల‌ను పూజించే ప్ర‌తి ఒక్క భ‌క్తుడికి కూడా చిన‌జీయ‌ర్ క్ష‌మాప‌ణ చెప్పాల్సిందేన‌ని ఆమె డిమాండ్ చేశారు.

స‌మ్మ‌క్క‌, సార‌ల‌మ్మ‌ల‌పై చిన‌జీయ‌ర్ చేసిన‌ అనుచిత వ్యాఖ్య‌లు త‌న‌ను ఎంత‌గానో బాధ‌పెట్టాయ‌ని పేర్కొన్న సీత‌క్క‌.. గురువారం మేడారంలోని స‌మ్మ‌క్క‌,సార‌ల‌మ్మల‌కు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. త‌న అనుచ‌రుల‌తో క‌లిసి మేడారం వెళ్లిన సీత‌క్క‌..అక్క‌డ పూజ‌లు నిర్వ‌హించిన అనంత‌రం మీడియాతో మాట్లాడారు.

Seethakka
Mulugu MLA
Sammakka Saralamma
Medaram
Chinna Jeeyar Sawmy
  • Error fetching data: Network response was not ok

More Telugu News