Loksatta: రైతులకు గిట్టుబాటు ధరలపై జేపీ మార్కు విశ్లేషణ
- రైతు పక్షపాతమంటూనే గిట్టుబాటు ధరలు రానివ్వరు
- పంట ఉత్పత్తులను భద్రపరచుకునే వెసులుబాటు ఉండాలి
- బడ్జెట్ నిధులు మెజారిటీ శాతం రైతు సంక్షేమానికే వెచ్చించాల్సిన అవసరం ఉందన్న జేపీ
దేశంలో వ్యవసాయ రంగం తీరు, రైతులకు మద్దతు ధరలు దక్కకుండా సాగుతున్న వైనంపై లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ తనదైన శైలి విశ్లేషణ వినిపించారు. రైతులు పండించే పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు వచ్చేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. భవిష్యత్తుల్లో బడ్జెట్ నిధులు మెజారిటీ శాతం రైతు సంక్షేమానికే వెచ్చించాల్సిన అవసరం ఉందని సూచించారు.
రాజకీయ నేతలంతా రైతు పక్షపాతులేనన్న జేపీ.. రైతుల పంటలకు మాత్రం రేట్లు రానివ్వరంటూ ఎద్దేవా చేశారు. నిత్యావసరాల ధరలు పెరిగిన సందర్భాల్లో చట్టసభల్లో నేతల తీరు .. కేవలం రైతులు పండించే ఉత్పత్తుల ధరలు పెరిగినప్పుడు మాత్రమే వీధికెక్కే తీరును ప్రస్తావించారు. ఇతరత్రా ధరలు పెరిగిన సందర్భంలో ఒక్కరంటే ఒక్కరు కూడా నోరెత్తరని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పండించే తమ ఉత్పత్తులను గిట్టుబాటు ధరలు లేని సమయంలో గోదాముల్లో భద్రపరచుకునే వెసులుబాటు కల్పించాలని జేపీ సూచించారు.