Prithvi Shah: యోయో టెస్టులో పృథ్వీ షా విఫలం.. ఢిల్లీ కేపిటల్స్ కు షాక్

Prithvi Shah fails in Yoyo test

  • యోయో టెస్టులో కనీసం 16.5 స్కోరు సాధించాలి
  • జస్ట్ పాస్ మార్కులతో బయటపడ్డ హార్ధిక్ పాండ్యా
  • బీసీసీఐ అనుమతిస్తే షా ఆడే అవకాశం

ఐపీఎల్ సీజన్ ముందు ఢిల్లీ కేపిటల్స్ కు షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్, కీలక బ్యాట్స్ మెన్ పృథ్వీ షా యోయో టెస్టులో విఫలమయ్యాడు. దీంతో ఈ మెగా టోర్నీకి షా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ లో పాల్గొనే ప్రతి ఆటగాడు యోయో టెస్టులో కనీసం 16.5 స్కోరు సాధించాల్సి ఉంటుంది. ఈ స్కోరు సాధించలేని ఆటగాడిని ఐపీఎల్ లో ఆడటానికి అనుమతించరు. మరోవైపు మరో కీలక ఆటగాడు హార్ధిక్ పాండ్యా జస్ట్ పాస్ మార్కులతో బయటపడినట్టు సమాచారం. హార్ధిక్ 17 పాయింట్లకు పైగా స్కోరును సాధించినట్టు తెలుస్తోంది. ఒకవేళ పృథ్వీ షాకు బీసీసీఐ అనుమతిస్తే అతను ఆడే అవకాశం ఉంటుంది.

Prithvi Shah
IPL
YOYO Test
Fail
Delhi Capitals
  • Loading...

More Telugu News