RRR: ఈ నెల 18 నుంచి 'ఆర్ఆర్ఆర్' ప్రచార యాత్ర

RRR promotional campaign starts tomorrow

  • ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఆర్ఆర్ఆర్
  • రాజమౌళి దర్శకత్వంలో మరో భారీ చిత్రం
  • ఈ నెల 25న రిలీజ్
  • వివిధ నగరాల్లో ప్రచార కార్యక్రమాలు
  • షెడ్యూల్ ప్రకటన

టాలీవుడ్ లో భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి నుంచి వస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్, అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్ నటించారు. మార్చి 25న ఈ భారీ బడ్జెట్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

 ఈ నేపథ్యంలో, ఈ నెల 18 నుంచి చిత్ర ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టయిన్ మెంట్స్ ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలోనే కాకుండా, విదేశీ గడ్డపైనా ప్రమోషనల్ ఈవెంట్లు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు వెల్లడించింది.

ఆర్ఆర్ఆర్ ప్రమోషనల్ కార్యక్రమాల షెడ్యూల్ ఇదే...

  • మార్చి 18- హైదరాబాదు
  • మార్చి 18- దుబాయ్
  • మార్చి 19- బెంగళూరు
  • మార్చి 20- బరోడా
  • మార్చి 20- ఢిల్లీ
  • మార్చి 21- అమృత్ సర్
  • మార్చి 21- జైపూర్
  • మార్చి 22- కోల్ కతా
  • మార్చి 22- వారణాసి


  • Loading...

More Telugu News