Chetan Bhagat: కశ్మీర్ ఫైల్స్ విమర్శకులకు చేతన్ భగత్ చురక!
- భావప్రకటన స్వేచ్ఛ కావాలంటారు
- కానీ కశ్మీర్ ఫైల్స్ లో దాన్ని చూపించొద్దంటారు
- ఫన్నీ అంటే ఇదేనంటూ చేతన్ వ్యాఖ్య
- చిత్రాన్నిమెచ్చుకుంటూ పోస్ట్
సమాజంలో విరుద్ధ అభిప్రాయాలతో ఉండే వారిని ప్రముఖ రచయిత చేతన్ భగత్ విమర్శించారు. కశ్మీర్ లో పండిట్లు, హిందువులపై జరిగిన అకృత్యాలు, ఊచకోతలను యావత్ ప్రపంచానికి తెలియజెప్పే లక్ష్యంతో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తీసిన సినిమాకు దేశవ్యాప్తంగా చక్కని ఆదరణ లభిస్తుండడం తెలిసిందే. దీన్ని కొందరు తప్పుబడుతున్నారు. అలా తప్పుబట్టే వారిని చేతన్ భగత్ నిలదీశారు.