Kuwait: కువైట్ సెంట్రల్ జైల్లో ఆత్మహత్య చేసుకున్న తెలుగు వ్యక్తి

Kadapa man commits suicide in Kuwait central jail
  • ఆత్మహత్యకు పాల్పడిన కడప జిల్లాకు చెందిన వెంకటేశ్
  • సేథ్ అహ్మద్ వద్ద కారు డ్రైవర్ గా పని చేస్తున్న వైనం
  • అహ్మద్ భార్య, కూతురు, మరో వ్యక్తిని హత్య చేసిన వెంకటేశ్
కువైట్ సెంట్రల్ జైల్లో కడప జిల్లాకు చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే దిన్నెపాలెం గ్రామానికి చెందిన వెంకటేశ్ ఉపాధి కోసం కువైట్ కు వెళ్లాడు. అక్కడ సేథ్ అహ్మద్ అనే వ్యక్తి వద్ద కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అయితే అహ్మద్ భార్య, కూతురు, ఆర్డియా అనే మరో వ్యక్తిని అతను హత్య చేశాడు. వీరిని హత్య చేసినట్టు విచారణలో అతను ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో సెంట్రల్ జైల్లో ఉన్న వెంకటేశ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతని ఆత్మహత్యకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.  
Kuwait
Central Jail
Kadapa District
Man
Suicide

More Telugu News