Elon Musk: పుతిన్ కు మరో సవాల్ విసిరిన ఎలాన్ మస్క్

Elon Musk challenges Putin

  • నాతో పోటీ పడు అంటూ పుతిన్ కు మస్క్ సవాల్
  • నీ సొంత ఎలుగుబంటిని కూడా తెచ్చుకో అంటూ మరో సవాల్
  • నువ్వో బలహీనుడువి అంటూ మస్క్ పై రష్యా స్పేస్ చీఫ్ ఫైర్


ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ కు స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ ఇటీవల ఛాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే. పుతిన్ తో ఫైట్ కు తాను సిద్ధమని... తనతో పోరాడేందుకు ఆయనకు సవాల్ విసురుతున్నానని చెప్పారు. తాజాగా ఆయన మరో సవాల్ విసిరారు. తనతో పోరాడేందుకు ఆయన సొంత ఎలుగుబంటిని కూడా తెచ్చుకోవచ్చని అన్నారు. 

మరోవైపు ఎలాన్ మస్క్ తొలి ఛాలెంజ్ విసిరిన వెంటనే రష్యా స్పేస్ ఏజెన్సీ చీఫ్ దిమిత్రి రొగోజిన్ స్పందిస్తూ... నువ్వు ఓ చిన్నదెయ్యమని అన్నారు. 'నాతో పోటీ పడడానికి నీకు బలం చాలదు... సమయం వృథా.. అందుకే ముందు నా తమ్ముడిపై గెలిచి చూపించు' అంటూ ఎద్దేవా చేశారు. 

ఇంకోవైపు రష్యా దాడులతో ఉక్రెయిన్ అతలాకుతలం అవుతోంది. ఈ నేపథ్యంలో మస్క్ తన స్టార్ లింక్ శాటిలైట్ ద్వారా ఉక్రెయిన్ కు బ్రాడ్ బ్యాండ్ సేవల్ని అందిస్తూ, ఆ దేశ ప్రజలకు అండగా నిలుస్తున్నారు.

Elon Musk
Vladimir Putin
Challenge
  • Loading...

More Telugu News