Chiranjeevi: ‘గాడ్ ఫాదర్’తో సల్లూ భాయ్​.. 'పక్కా కిక్కే' అన్న చిరంజీవి!

Salman Joins Shooting Sets Of Chirus God Father In Mumbai

  • కీలక పాత్రలో సల్మాన్ ఖాన్
  • ఇవాళ సెట్ లోకి అడుగు
  • ముంబైలో జరుగుతున్న షూటింగ్
  • ఆ ఫొటోను పోస్ట్ చేసిన చిరూ

‘గాడ్ ఫాదర్’ చిరంజీవికి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ జత కలిస్తే.. ఇద్దరు పెద్ద హీరోలు ఒకేసారి స్క్రీన్ లో కనిపిస్తే.. బొమ్మ అదుర్స్ కాదా! అదే జరిగింది. చిరంజీవి తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’లో సల్లూ భాయ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

తాజాగా ఇవాళ ఆయన ‘గాడ్ ఫాదర్’ సెట్ లోకి అడుగు పెట్టేశారు. పొలిటికల్, యాక్షన్ థ్రిల్లర్ అయిన ఈ సినిమా షూటింగ్ లో చిరంజీవికి ఆయన జత కలిసేశారు. ప్రస్తుతం ముంబైలో ఈ సినిమా షూటింగ్ తాజా షెడ్యూల్ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇవాళ సల్మాన్ ఖాన్ అక్కడకు వెళ్లి షూటింగ్ లో చేరిపోయారు. 

సల్మాన్ ఖాన్ తో కలిసి దిగిన ఫొటోను చిరంజీవి తన ట్విట్టర్ లో అభిమానులతో పంచుకున్నారు. ‘‘గాడ్ ఫాదర్ టీంలోకి భాయ్ సల్మాన్ ఖాన్ కు స్వాగతం. మీ రాకతో ప్రతి ఒక్కరిలో ఉత్సాహం రెట్టింపైంది. అందరిలోనూ ఎనర్జీని పెంచింది. సల్మాన్ తో స్క్రీన్ పంచుకోవడం ఆనందంగా ఉంది. సల్మాన్ ఖాన్ నటనతో అభిమానులకు మ్యాజిక్ కిక్ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు’’ అని ఆయన ట్వీట్ చేశారు. 

మలయాళ సూపర్ హిట్ సినిమా ‘లూసిఫర్’కు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా డైరెక్ట్ చేస్తుండగా.. కొణిదెల ప్రొడక్షన్ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. చిరు సోదరి పాత్రలో నయనతార కనిపించనుంది. సత్యదేవ్ కీలక పాత్రలో నటించనున్నట్టు తెలుస్తోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News