Telugudesam: సభను తప్పు దారి పట్టించేలా జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న చేశార‌ని అసెంబ్లీలో టీడీపీ ఆందోళ‌న‌.. 11 మందిపై స‌స్పెన్ష‌న్

tdp agitation in assembly

  • జంగారెడ్డిగూడెం మ‌ర‌ణాల‌పై నిర‌స‌న‌
  • స్పీకర్ పోడియం దగ్గరకు టీడీపీ స‌భ్యులు 
  • కావాలనే రాజకీయం చేస్తున్నారన్న నారాయ‌ణస్వామి

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో నేడు కూడా టీడీపీ స‌భ్యులు నిర‌స‌న తెలిపారు. జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంటోన్న మ‌ర‌ణాల‌పై ఏపీ అసెంబ్లీలో చ‌ర్చ జ‌ర‌గాల్సిందేన‌ని టీడీపీ స‌భ్యులు సభలో ఆందోళ‌న‌కు దిగారు. జంగారెడ్డిగూడెంలో మ‌ర‌ణాల‌పై సీఎం జగన్ చేసిన వ్యాఖ్య‌లు సభను తప్పు దారి పట్టించేలా ఉన్నాయ‌ని టీడీపీ స‌భ్యులు ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. 

స్పీకర్ పోడియం దగ్గరకు టీడీపీ స‌భ్యులు వెళ్లడంతో వారిని ఒకరోజు సస్పెండ్ చేయాలని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. టీడీపీ సభ్యులు కావాలనే రాజకీయం చేస్తున్నారని ఆయ‌న అన్నారు.  వారి జాతకాలు రేపు బయటపెడతాన‌ని హెచ్చరించారు. 

తాను బ‌య‌ట‌పెట్టే ఆ విష‌యాలు త‌ప్ప‌ని నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని స‌వాలు విసిరారు. అనంత‌రం టీడీపీ స‌భ్యుల‌పై సస్పెన్ష‌న్ వేటు వేస్తూ  స్పీకర్‌ తమ్మినేని సీతారాం నిర్ణ‌యం తీసుకున్నారు. సభ నుంచి మొత్తం 11 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్ర‌క‌టించారు. అనంత‌రం సభ కాసేపు వాయిదా ప‌డింది. స‌భ‌లో ప‌లు అంశాల‌పై చ‌ర్చ‌లు కొన‌సాగాల్సి ఉంది.

  • Loading...

More Telugu News