Balaji Nagalingam: రష్మీని ఫిలింనగర్ గేటుకు కట్టేస్తానని హెచ్చరించిన ప్రముఖ నిర్మాత ఎవరో తెలుసా...?

Producer warns Rashmi

  • రాణి గారి బంగ్లా చిత్రంలో నటించిన రష్మీ
  • చిత్ర నిర్మాణ సమయంలో సంగతులు వెల్లడించిన నిర్మాత
  • హీరోను మార్చాలని రష్మీ గోల చేసిందని ఆరోపణ
  • ప్రముఖుల పేర్లు చెప్పి బెదిరించే ప్రయత్నం చేసిందని వివరణ

టాలీవుడ్ సెలబ్రిటీ రష్మీ గౌతమ్ కొద్దికాలంలోనే తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. బుల్లితెరపై సత్తా చాటి, తన అందచందాలు, ప్రతిభతో సినీ రంగంలోనూ కాంతులీనుతున్న రష్మీ గౌతమ్ కుర్రకారును విపరీతంగా ఆకర్షించే యువ తారల్లో ఒకరు. కాగా, ఓ టాలీవుడ్ నిర్మాత రష్మీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన పేరు బాలాజీ నాగలింగం. రష్మీతో ఆయన 'రాణి గారి బంగ్లా' చిత్రాన్ని నిర్మించారు. 

చిత్ర నిర్మాణ సమయంలో రష్మీ తమను ముప్పుతిప్పలు పెట్టిందని బాలాజీ నాగలింగం వెల్లడించారు. సినిమా సగం పూర్తయ్యాక హీరోను మార్చమని గొడవ చేసిందని ఆరోపించారు. ఎలాగోలా ఆమెకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా, రష్మీ మరింత మొండికేసిందని అన్నారు. అంతేకాదు, కొందరు టాలీవుడ్ ప్రముఖుల (నాగబాబు, శ్యాంప్రసాద్ రెడ్డి) పేర్లు చెప్పి తనను బెదిరించే ప్రయత్నం చేసిందని వెల్లడించారు. 

అయితే తాను ఆమె బెదిరింపులకు భయపడలేదని, చాన్నాళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉన్నానని, నాకు కూడా టాలీవుడ్ పెద్దలు తెలుసని ఆమెకు గట్టిగా చెప్పానని నాగలింగం వివరించారు. అంతేకాదు, సినిమా పూర్తికాకుండా వెళ్లిపోతే కేసు పెడతానని, ఫిలింనగర్ గేటుకు కట్టేసి కొడతానని వార్నింగ్ ఇచ్చినట్టు ఆయన వెల్లడించారు. అప్పటినుంచి రష్మీలో మార్పు వచ్చిందని, షూటింగ్ పూర్తి చేసిందని తెలిపారు. 

తన కెరీర్ లో రాధ, శ్రీదేవి వంటి హీరోయిన్లను చూశానని, వాళ్లు మాట మీద నిలబడేవారని బాలాజీ నాగలింగం పేర్కొన్నారు. అసలు నా వయసెంత, రష్మీ వయసెంత... చొంగ కార్చుకునే రకం కాదు నేను అంటూ వ్యాఖ్యానించారు.

Balaji Nagalingam
Producer
Rashmi Gautam
Rani Gari Bangla
Tollywood
  • Loading...

More Telugu News