Taapsee: పిల్లలు చేసే పెద్ద ఆపరేషన్ 'మిషన్ ఇంపాజిబుల్' .. ట్రైలర్ రిలీజ్!

Mishan Impossible Trailer Released

  • తాప్సీ ప్రధాన పాత్రగా 'మిషన్ ఇంపాజిబుల్'
  • 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ' దర్శకుడి మరో ప్రయత్నం 
  • దావూద్ ఇబ్రహీమ్ కోసం ముగ్గురు కుర్రాళ్ల అన్వేషణ 
  • ఏప్రిల్ 1వ తేదీన విడుదల    

తాప్సీ ప్రధాన పాత్రగా 'మిషన్ ఇంపాజిబుల్' రూపొందింది. నిరంజన్ రెడ్డి - అవినాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మించగా, స్వరూప్ దర్శకత్వం వహించాడు. ఒక వైపున సస్పెన్స్ ను .. మరో వైపున కామెడీని కలిపి నడిపించడం ఆయన ప్రత్యేకత. గతంలో ఆయన తెరకెక్కించిన 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'నే అందుకు ఒక ఉదాహరణ. 

మహేశ్ బాబు  చేతుల మీదుగా ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ముగ్గురు కుర్రాళ్లు 'రఘుపతి రాఘవ రాజారామ్'. వాళ్లపై సినిమాల ప్రభావం ఎక్కువ. అందువల్లనే తమని 'ఆర్ ఆర్ ఆర్' అని చెప్పుకుంటూ ఉంటారు. దావూద్ ఇబ్రాహీమ్ ను పట్టిస్తే 50 లక్షల బహుమానం అనే ప్రకటన టీవీలో చూసి ముగ్గురూ ఆ పనిపై బయల్దేరతారు. 

దావూద్ ఇబ్రహీమ్ ఎవరు? ఆయన ఎక్కడ ఉండొచ్చు? అనే ఒక ఆలోచన లేకుండా వెళ్లిన ఆ పిల్లలకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆ అవాంతరాలను వాళ్లు ఎలా అధిగమించారనేదే కథ. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. పెద్దలతో పాటు పిల్లలు కూడా చూసే ఈ సినిమా, ఏప్రిల్ 1వ తేదీన విడుదల కానుంది. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News