Akbaruddin Owaisi: తెలంగాణకు కేసీఆర్ అవసరం ఎంతో ఉంది: అక్బరుద్దీన్ ఒవైసీ

Telangana needs KCR says Akbaruddin Owaisi

  • కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా
  • తెలంగాణ రాష్ట్రం అమలుచేస్తున్న పథకాలను పొరుగు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి
  • విద్యార్థులకు ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నా అక్బర్ 

అసెంబ్లీ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆకాశానికి ఎత్తేశారు. రాష్ట్ర పజల ఆకాంక్షలు నెరవేరాలంటే తెలంగాణకు కేసీఆర్ అవసరం ఎంతో ఉందని ఆయన అన్నారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని, ప్రజలకు మరింత సేవ చేయాలని కోరుకుంటున్నానని చెప్పారు. 

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను పొరుగు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని అమలు చేస్తున్నాయని అక్బరుద్దీన్ ప్రశంసించారు. అందరం కలిసి బంగారు తెలంగాణ కలను సాకారం చేద్దామని చెప్పారు. విద్య, వైద్య, పోలీస్ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయడం మంచి నిర్ణయమని అన్నారు. అయితే, ఉద్యోగ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరారు. ఉర్దూ మీడియం విద్యార్థుల కోసం ఉర్దూ మీడియంలో కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని విన్నవించారు.

Akbaruddin Owaisi
MIM
Telangana
KCR
TRS
  • Loading...

More Telugu News