Vellampalli Srinivasa Rao: ముఖ్యమంత్రి జ‌గ‌న్‌ను క‌లిసిన మంత్రి వెల్లంపల్లి, టీటీడీ ఛైర్మన్‌

vellampalli meets jagan

  • శాసనసభ ప్రాంగ‌ణానికి వ‌చ్చిన మంత్రి, టీటీడీ ఛైర్మన్, ఈఓ 
  • విశాఖపట్నంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ‌కు ఆహ్వానం
  • ముఖ్యమంత్రికి పండితుల వేద ఆశీర్వచనం

అమరావతి శాసన సభ ప్రాంగ‌ణంలోని ఏపీ సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ను రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ కె.ఎస్‌ జవహర్‌రెడ్డి, తిరుమల తిరుపతి దేవ‌స్థానం వేద పండితులు కలిశారు.

                      
విశాఖపట్నంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ‌ మహా సంప్రోక్షణ కార్యక్రమానికి సీఎం జగన్‌ను వారు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చి, తీర్థ‌ ప్రసాదాలను అందజేశారు.

Vellampalli Srinivasa Rao
Jagan
TTD
  • Loading...

More Telugu News