Chiranjeevi: 'గాడ్ ఫాదర్'ని అయోమయానికి గురిచేసే పాత్రలో అనసూయ!

God Father movie upadate

  • వరుస సినిమాలతో బిజీగా అనసూయ 
  • 'పుష్ప'లో అంతగా పేలని దాక్షాయణి పాత్ర
  • 'ఖిలాడి' ఫ్లాప్ తో చంద్రకళకి దక్కని మార్కులు 
  • 'గాడ్ ఫాదర్' సినిమాపైనే అనసూయ ఆశలు

చిరంజీవి కథానాయకుడిగా మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్' సినిమా రూపొందుతోంది. చరణ్ - నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా తాజా షెడ్యూల్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. చిరంజీవి - సల్మాన్ కాంబినేషన్లోని సీన్స్ ను అక్కడ చిత్రీకరిస్తున్నారు. 

ఈ సినిమాలో నయనతార .. సత్యదేవ్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. మరో ముఖ్యమైన పాత్రలో అనసూయ నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె పాత్ర నెగెటివ్ షేడ్స్ తో కనిపిస్తుందని అంటున్నారు. ఇతరులు ఆడించే నాటకంలో పావుగా మారిపోయి కథానాయకుడిని అయోమయానికి గురిచేసే గర్భవతి పాత్రలో ఆమె కనిపిస్తుందని చెబుతున్నారు. 

అనసూయ ఇటీవల చేసిన 'పుష్ప' సినిమాలోని 'దాక్షాయణి' పాత్ర ఆమెకి ఆశించినస్థాయి గుర్తింపును తీసుకురాలేదు. ఆ తరువాత 'ఖిలాడి'లో 'చంద్రకళ'గా కాస్త రొమాంటిక్ గా కనిపించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆ సినిమా సక్సెస్ వైపుకు వెళ్లకుండా ట్రాక్ తప్పేసింది. మరి 'గాడ్ ఫాదర్' సినిమాలోని ఈ పాత్ర ఆమెకి ఏ స్థాయి రెస్పాన్స్ ను తెచ్చిపెడుతుందనేది చూడాలి.

Chiranjeevi
Nayanatara
Aanasuya
  • Loading...

More Telugu News