Ukraine: భారతీయ విద్యార్థులకు ఊరట.. ఉక్రెయిన్ నుంచి ఆన్ లైన్ క్లాసులు

Ukraine varsities go virtual classes for Indians
  • చాలా యూనివర్సిటీల నిర్ణయం
  • సోమవారం నుంచి మొదలైన ఆన్ లైన్ బోధన
  • విద్యా అంశాలనే మాట్లాడాలంటూ షరతు
  • మధ్య మధ్యలో ఇంటర్నెట్ సమస్యలు
యుద్ధం కారణంగా వైద్య విద్యను అర్థాంతరంగా నిలిపివేసి భారత్ కు తిరిగొచ్చిన విద్యార్థులకు ఊరట లభించింది. ఒకవైపు యుద్ధంతో సతమతం అవుతున్నప్పటికీ.. అక్కడి విద్యా సంస్థలు విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఆన్ లైన్ క్లాసులను సోమవారం మొదలు పెట్టాయి. 

‘‘అందరూ క్షేమంగా ఉన్నారా? ఉంటే క్లాసుల్లో చేరొచ్చు. రెండున్నర గంటల పాటు ఆన్ లైన్ క్లాసెస్ ఉంటాయి. కేవలం విద్యా అంశాలే మాట్లాడాల్సి ఉంటుంది’’ అంటూ బోగోమెలెట్స్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ నుంచి విద్యార్థులకు టెలిగ్రామ్ సందేశాలు అందాయి. మధ్య మధ్యలో ఇంటర్నెట్ అవాంతరాలు ఏర్పడినా క్లాసు సజావుగా సాగినట్టు విద్యార్థులు వెల్లడించారు.

ఉక్రెయిన్ వ్యాప్తంగా దాదాపు చాలా యూనివర్సిటీలు ఆన్ లైన్ క్లాసుల సమాచారాన్ని విద్యార్థులకు తెలియజేశాయి. గతంలో మాదిరే ఆన్ లైన్ లోనూ బోధన ఉంటుందని పేర్కొన్నాయి. యుద్ధం నేపథ్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు తరలిపోవడంతో అవి ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఉక్రెయిన్ లోని చాలా విద్యా సంస్థల్లో విదేశీ విద్యార్థులే ఎక్కువ మంది ఉంటారు. 

కొందరు ప్రొఫెసర్లు ఆయుధాలతో యుద్ధంలో చేరిపోవడంతో.. కొన్ని యూనివర్సిటీలు, ఇతర యూనివర్సిటీల ఆన్ లైన్ క్లాసులకు తమ విద్యార్థులను అనుసంధానిస్తున్నాయి. కనుక ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన విద్యార్థులు ఎవరైనా ఇంకా ఆన్ లైన్ క్లాసుల గురించి తెలియకపోతే యూనివర్సిటీలను సంప్రదించడం మంచిది.
Ukraine
univarsitys
online classes
Indian students

More Telugu News