Sensex: భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు

Markets ends in profits

  • ఉదయం నుంచి లాభాల్లో కొనసాగిన మార్కెట్లు  
  • 936 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ 
  • 241 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం నుంచి మార్కెట్లు లాభాల్లోనే కొనసాగాయి. ఉక్రెయిన్, రష్యా మధ్య చర్చలు ప్రారంభం కావడం మదుపరుల సెంటిమెంటును బలపరిచింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 936 పాయింట్లు లాభపడి 56,486కి ఎగబాకింది. నిఫ్టీ 241 పాయింట్లు పెరిగి 16,871కి చేరుకుంది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇన్ఫోసిస్ (3.76%), హెచ్డీఎఫ్సీ (3.25%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.14%), మారుతి (2.92%), యాక్సిస్ బ్యాంక్ (2.78%). 

టాప్ లూజర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (-1.66%), సన్ ఫార్మా (-1.09%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీ (-0.52%), టాటా స్టీల్ (-0.33%).

  • Loading...

More Telugu News