Canada: కెనడాలో ఘోర రోడ్డుప్రమాదం.. ఐదుగురు భారతీయ విద్యార్థుల మృతి

5 Indian students died in Canada  accident

  • టొరంటో సమీపంలో రోడ్డు ప్రమాదం 
  • ప్యాసింజర్ వ్యాన్ ను ఢీకొన్న ట్రాక్టర్
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు విద్యార్థులు

కెనడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భారతీయ విద్యార్థులు మృతి చెందారు. ఆంటారియో హైవేపై ప్రమాదం సంభవించింది. మృతులు ప్యాసింజర్ వ్యానులో ప్రయాణిస్తుండగా... ఆ వ్యాన్ ను ట్రాక్టర్ ఢీకొంది. విద్యార్థులు చనిపోయిన విషయాన్ని కెనడాలోని ఇండియన్ హై కమిషనర్ అజయ్ బిసారియా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 

కెనడాలో హృదయ విదారకమైన ఘటన చోటు చేసుకుందని... టొరంటో సమీపంలో ఐదుగురు భారతీయ విద్యార్థులు ఆటో యాక్సిడెంట్ లో మృతి చెందారని అజయ్ బిసారియా తెలిపారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల స్నేహితులతో తాము టచ్ లో ఉన్నామని చెప్పారు. మృతులను హర్ ప్రీత్ సింగ్, జస్పీందర్ సింగ్, కరణ్ పాల్ సింగ్, మోహిత్ చౌహాన్, పవన్ కుమార్ గా పోలీసులు గుర్తించారు.

Canada
Road Accident
Indians
Dead
  • Loading...

More Telugu News