Virat Kohli: కింగ్ వస్తే ఆ మాత్రం ఉండాలి మరి.. కోహ్లీ బ్యాటింగ్ కు దిగడంతోనే మోతెక్కిన చిన్నస్వామి స్టేడియం.. ఇదిగో వీడియో

Fans Welcome In Grand Manner To King Kohli

  • నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన కోహ్లీ
  • రోహిత్ అవుటవగానే మైదానంలోకి
  • ‘లోకల్ బాయ్’ కు గ్రాండ్ వెల్ కం చెప్పిన ఫ్యాన్స్

కింగ్ అలా నడుచుకుంటూ వస్తే.. ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ అనేలా రాజసంగా ముందుకు కదిలితే ఎలా ఉంటది! ‘తగ్గేదేలె’ అంటూ అభిమానులు హోరెత్తించరూ! నిన్న బెంగళూరు వేదికగా శ్రీలంకతో మొదలైన రెండో టెస్టులో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కు దిగగానే జరిగిన తంతు అదే. నాలుగో స్థానంలో కోహ్లీ బ్యాటింగ్ కోసం మైదానంలోకి అడుగు పెట్టగానే అభిమానులు కేకలతో చిన్నస్వామి స్టేడియాన్ని మోతెక్కించేశారు. 

అసలే కోహ్లీ అక్కడ లోకల్ బాయ్ (ఆర్సీబీ మాజీ సారథి కదా).. మరి, ఆ మాత్రం వెల్ కమ్ ఉండొద్దూ. దానికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ‘‘ఎం. చిన్నస్వామి స్టేడియంలో అభిమానులతో అతడిది ప్రత్యేకమైన అనుబంధం. కింగ్ గ్లోరీ ఏ మాత్రం తగ్గలేదు’’ అంటూ కామెంట్ చేసింది. కాగా, ఈ మ్యాచ్ లోనైనా సెంచరీ చేస్తాడని ఆశించిన అభిమానులకు.. కోహ్లీ మరోసారి నిరాశనే మిగిల్చాడు. 24 పరుగులు చేసి వెనుదిరిగాడు. మరి, రెండో ఇన్నింగ్స్ లోనైనా మాజీ సారథి సెంచరీతో చెలరేగిపోవాలని ఆశిద్దాం.

  • Error fetching data: Network response was not ok

More Telugu News