Telangana: 16 నుంచి తెలంగాణలో ఒంటిపూడ బడులు
- ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు బడులు
- ఎండలు పెరుగుతున్నందున తెలంగాణ సర్కారు నిర్ణయం
- ఒంటిపూట బడులపై ఆదేశాలు జారీ
ఎండలు అప్పుడే మండిపోతున్నాయి. నానాటికీ పగటి పూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీంతో పాఠశాల విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా ఒంటి పూట బడులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నెల 16 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని అన్ని పాఠశాలలకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శనివారం తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న ఒంటిపూట బడులను ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. ఇదిలా ఉంటే.. మే 20వ తేదీన 10వ తరగతి పరీక్షలు ముగియనున్నాయి. అదే రోజు స్కూళ్లకు చివరి పనిదినం కానుంది. జూన్ 12వ తేదీ నుండి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది.