Woman: భర్త తల నరికి కులదేవత ఎదుట ఉంచిన మహిళ

Tripura woman beheads husband

  • త్రిపురలోని ఖోవాయ్ జిల్లాలో దారుణం
  • నిద్రిస్తున్న భర్తను అంతమొందించిన మహిళ
  • మానసిక వ్యాధితో బాధపడుతున్న మహిళ
  • అరెస్ట్ చేసిన పోలీసులు

త్రిపురలో ఓ మహిళ దారుణానికి పాల్పడింది. 42 ఏళ్ల మహిళ తన భర్త తల నరికి, రక్తమోడుతున్న ఆ తలను తమ కులదేవత ఆలయంలో ఉంచింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆమె భర్త పేరు రబీంద్ర తంతి (50). ఈ దంపతులు ఖోవాయ్ జిల్లాలోని ఇందిరా కాలనీ గ్రామంలో నివసిస్తున్నారు. జరిగిన ఘటనపై ఆమె పెద్దకుమారుడు వివరాలు తెలిపాడు. 

"మా అమ్మ మానసికపరమైన జబ్బుతో బాధపడుతోంది. ఇటీవలే ఓ భూతమాంత్రికుడి వద్ద పూజలు చేయించుకుంది. మా అమ్మ ఇప్పటివరకు శాకాహారం మాత్రమే తినేది. అయితే గతరాత్రి చికెన్ తో భోజనం చేసింది. భోజనాలు అయిన తర్వాత అందరం పడుకున్నాం. మధ్యలో మెలకువ వచ్చి చూస్తే మా నాన్న తల తెగిపడి ఉంది. మా అమ్మ చేతిలో రక్తంతో తడిసిన ఓ పదునైన ఆయుధం ఉంది. దాంతో మేం కేకలు వేసేసరికి మా అమ్మ ఆ తలతో బయటికి పరుగులు తీసింది. మా కులదేవత ఆలయంలో ఆ తలను ఉంచింది" అని వివరించాడు. 

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోగా, ఓ గదిలో తలుపులు వేసుకుని కూర్చున్న ఆ మహిళను అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Woman
Behead
Husband
Khowai District
Tripura
  • Loading...

More Telugu News