Akash Puri: విజయ్ దేవరకొండ చేతుల మీదుగా 'చోర్ బజార్' సాంగ్ రిలీజ్!

Chor Bazaar song released

  • జీవన్ రెడ్డి దర్శకత్వంలో 'చోర్ బజార్'
  • ఆకాశ్ పూరి జంటగా గెహనా సిప్పి 
  • సంగీత దర్శకుడిగా సురేశ్ బొబ్బిలి 
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు

ఆకాశ్ పూరి హీరోగా 'చోర్ బజార్' సినిమా రూపొందింది. వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమాకి జీవన్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి సురేశ్ బొబ్బిలి సంగీతాన్ని సమకూర్చాడు. ఆయన స్వరపరిచిన పాటల్లోని 'జడ' అనే పాటను విజయ్ దేవరకొండ చేతుల మీదుగా కొంతసేపటి క్రితం రిలీజ్ చేయించారు. 
 
'అబ్బబ్బా ఇది ఏం పోరి .. చూడగానే కళ్లు చెదిరి .. కోసేసానమ్మో దాని జడపై మనసు పడి' అంటూ ఈ పాట సాగుతోంది. హీరో హైదరాబాద్ .. పాత బస్తీకి చెందిన కుర్రాడు. తాను ప్రేమించిన అమ్మాయి అందచందాలను వర్ణిస్తూ తన గ్యాంగ్ తో కలిసి పాడే పాట ఇది. చోర్ బజార్ నే ఏలేసే నా మనసునే ఈ పిల్ల చోరీ చేసేసిందే అనే అర్థంలో సాగుతోంది. 

మిట్టపల్లి సురేందర్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను రామ్ మిర్యాల ఆలపించాడు. మాస్ కుర్రాళ్లకు ఈ పాట ఎక్కే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈ కాలంలో నాగుపాములాంటి జడ .. నడుముపై నాట్యం చేసే 'జడగంటలు' గురించి హీరో పాడటం ఆశ్చర్యంగా అనిపించకమానదు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.

Akash Puri
Gehana Sippi
Chor Bazar Movie
  • Error fetching data: Network response was not ok

More Telugu News