Radhe Shyam Movie: తొలి రోజు కలెక్షన్లలో 'పుష్ప'ను బీట్ చేసిన 'రాధే శ్యామ్'

Radhe Shyam movie first day collections beats Pushpa movie collections

  • తొలి రోజు రూ. 79 కోట్ల గ్రాస్ సాధించిన 'రాధే శ్యామ్'
  • ఫస్ట్ డే రూ. 71 కోట్లు వసూలు చేసిన 'పుష్ప'
  • బాక్సాఫీస్ ను 'రాధే శ్యామ్' శాసిస్తోందన్న యూవీ క్రియేషన్స్

ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్లో నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన 'రాధే శ్యామ్' మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ వసూళ్లలో మాత్రం దూసుకుపోతోంది. తొలి రోజు ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు రూ. 79 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ స్వయంగా ప్రకటించింది. బాక్సాఫీస్ ను 'రాధే శ్యామ్' శాసిస్తోందని యూవీ క్రియేషన్స్ ట్వీట్ చేసింది. కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత తమ చిత్రాన్ని హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిపినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని పేర్కొంది.  

మరోవైపు తొలి రోజు వసూళ్లలో అల్లు అర్జున్ చిత్రం 'పుష్ప'ను 'రాధే శ్యామ్' బీట్ చేసింది. తొలి రోజున 'పుష్ప' రూ. 71 కోట్లు వసూలు చేసింది. 'పుష్ప' చిత్రానికి కూడా తొలి రోజున మిశ్రమ స్పందన వచ్చింది. ఆ తర్వాత పుంజుకుని ఏకగా రూ. 330 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇదే రీతిలో 'రాధే శ్యామ్' కూడా భారీ వసూళ్లను రాబడుతుందేమో వేచి చూడాలి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News