Bandi Sanjay: ప్రతి నియోజకవర్గంలో ఒక కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయండి: కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ

Bandi Sanjay writes letter to KCR

  • కరోనా వల్ల కోచింగ్ కు యువత ఖర్చు పెట్టే పరిస్థితి లేదు
  • నియోజకవర్గాల్లో ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలి
  • అల్పాహారం, భోజనం ఉచితంగా ఇవ్వాలన్న సంజయ్ 

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల జాతరకు తెరలేచిన సంగతి తెలిసిందే. వివిధ శాఖలకు సంబంధించి 80,039 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. 

గత రెండేళ్లుగా కరోనా వల్ల తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల వల్ల పోటీ పరీక్షల కోచింగ్ కోసం యువత పెద్దగా ఖర్చు పెట్టే పరిస్థితి లేదని అన్నారు. ఈ నేపథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థుల కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. 

మారుమూల ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రాలకు రావడం నిరుద్యోగ యువతకు వ్యయప్రయాసలతో కూడుకున్న వ్యవహారమని.. అందువల్ల నియోజకవర్గానికి ఒక ఉచిత స్టడీ సర్కిల్ ను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకునే విద్యార్థులకు ప్రభుత్వమే ఉచితంగా అల్పాహారం, భోజన సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News