Russia: మీ ఆంక్షల వల్ల అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కూలిపోవచ్చు: అమెరికాకు రష్యా వార్నింగ్
- రష్యాపై పెద్ద ఎత్తున ఆంక్షలు విధిస్తున్న అమెరికా, ఇతర దేశాలు
- స్పేస్ స్టేషన్ లోని రష్యన్ వెస్సెల్స్ సర్వీసింగ్ కార్యక్రమాలకు ఆంక్షలు అడ్డంకిగా మారుతాయన్న రష్యా
- అదే జరిగితే కక్ష్యను సరిచేసే వ్యవస్థ దెబ్బతింటుందని వార్నింగ్
ఉక్రెయిన్ పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై అమెరికా సహా పలు దేశాలు పెద్ద ఎత్తున ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. రష్యాను ఆర్థికంగా దెబ్బతీసే దిశగా ఆంక్షలను విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా స్పేస్ ఏజెన్సీ హెడ్ రోస్కోస్మస్ అమెరికాకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. రష్యాపై ఆంక్షలను ఎత్తివేయకపోతే 500 టన్నుల బరువైన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్) కూలిపోతుందని హెచ్చరించారు.
స్పేస్ స్టేషన్ లో రష్యన్ వెస్సెల్స్ సర్వీసింగ్ కార్యక్రమాలకు ఆంక్షలు అడ్డంకిగా మారుతాయని చెప్పారు. అదే జరిగితే స్పేస్ స్టేషన్ కక్ష్యను సరిచేసే వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంటుందని... దీంతో స్పేస్ స్టేషన్ సముద్రంలోనో, భూమిపైనో కూలిపోయే అవకాశం ఉంటుందని అన్నారు.