Sajjala Ramakrishna Reddy: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం మాకేముంది?: సజ్జల రామకృష్ణారెడ్డి

No need to go for early elections says Sajjala Ramakrishna Reddy

  • ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం మాకు లేదు
  • ఐదేళ్లు పాలించమని ప్రజలు అధికారం ఇచ్చారు
  • త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది

ఏపీలో టీడీపీ ఉనికిని కోల్పోతోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉనికిని కాపాడుకోవడానికే చంద్రబాబు ముందస్తు ఎన్నికలంటూ హడావుడి మొదలు పెట్టారని విమర్శించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. తమకు ఐదేళ్ల అధికారాన్ని ప్రజలు ఇచ్చారని, ఆ అధికారాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం తమకేముందని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేయాలనుకునే వారే ముందస్తుకు వెళతారని అన్నారు. 

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ రెండున్నరేళ్లకు ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ ముందే చెప్పారని సజ్జల తెలిపారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని చెప్పారు. పార్టీని బలోపేతం చేసుకోవడం, ప్రభుత్వ పాలన రెండూ తమకు ముఖ్యమేనని అన్నారు. కోట్లాది మంది ప్రజల ఆకాంక్షల దిశగా అడుగులు వేసే పార్టీ తమదని చెప్పారు. అధికారం కోసం కొట్లాడే రాజకీయాన్ని వైసీపీ చేయదని, ప్రజలకు సేవ చేయడంలోనే పోటీ చూపిస్తుందని, అందుకే అంత ప్రజాదరణ దక్కుతోందని చెప్పారు.

  • Loading...

More Telugu News