Kamal Haasan: భారీ రేటుకు కమల్ 'విక్రమ్' తెలుగు డబ్బింగ్ రైట్స్!

Vikram movie update

  • లోకేశ్ కనగరాజ్ రూపొందించిన సినిమా 
  • ఈ నెల 14న రిలీజ్ డేట్ ప్రకటన 
  • తెలుగు అనువాద హక్కులు 11 కోట్లకు? 
  • కీలక పాత్రల్లో విజయ్ సేతుపతి .. ఫాహద్ ఫాజిల్

కమలహాసన్ కథానాయకుడిగా ఆయన తాజా చిత్రంగా 'విక్రమ్' రూపొందింది. తన సొంత బ్యానర్ పై కమల్ నిర్మించిన ఈ సినిమాకి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ నెల 14వ తేదీన ఉదయం 7 గంటలకు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేయనున్నారు. 

కమల్ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఇక్కడి సినిమాల మాదిరిగానే ఆదరిస్తారు. కమల్ ను ఒక పరభాషా నటుడిగా తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ అనుకోలేదు. అందువలన ఆయన సినిమాలు ఇక్కడ భారీ స్థాయిలో విడుదలవుతూ ఉంటాయి. అలాగే తమిళంతో పాటు తెలుగులోను 'విక్రమ్' సినిమా భారీస్థాయిలో విడుదల కానుంది.

ఈ సినిమా తెలుగు అనువాద హక్కులు 11 కోట్లకు అమ్ముడయ్యాయట. ఈ స్థాయి రేటుకు ఈ సినిమా కొనుగోలు జరగడానికి కారణం కమల్ కి గల క్రేజ్ తో పాటు, దర్శకుడిగా లోకేశ్ కనగరాజ్ కి గల ఇమేజ్ కూడా తోడైందని అంటున్నారు. ఇక విజయ్ సేతుపతి .. ఫాహద్ ఫాజిల్ వంటి ఆర్టిస్టులు ఉండటం కూడా మరో కారణమని చెప్పుకుంటున్నారు.

Kamal Haasan
Vijay Sethupathi
Lokesh Kanagaraj
Vikram Movie
  • Loading...

More Telugu News