Prabhas: ప్రభాస్ మనసు దోచేసిన తమన్!

Thaman got another chance for Prabhas movie

  • టాలీవుడ్ లో దూసుకుపోతున్న తమన్ 
  • 'అఖండ'తో మరింత పెరిగిన క్రేజ్ 
  • 'రాధేశ్యామ్'కి హైలైట్ గా తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్
  • మారుతి దర్శకత్వంలో సినిమాకు కూడా మ్యూజిక్ 

ప్రభాస్ హీరోగా నిన్న థియేటర్లకు 'రాధేశ్యామ్' వచ్చింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విజువల్ వండర్ గా మార్కులు కొట్టేసింది. కథాకథనాల పరంగా .. పాత్రల రూపకల్పన విషయంలో కాస్త వీక్ గా ఉన్నప్పటికీ, ఫొటోగ్రఫీ .. సంగీతం .. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను కొంతవరకూ ఆదుకునే ప్రయత్నం చేశాయి. 

'అఖండ' సినిమాకి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చూసి బాలయ్య ఆయనను ఎంతగా మెచ్చుకున్నారో, 'రాధేశ్యామ్' చూసిన తరువాత ప్రభాస్ కూడా అంతగానే అభినందనలు తెలియజేశాడట. అంతేకాదు మారుతి దర్శకత్వంలో తాను చేయనున్న 'రాజా డీలక్స్' సినిమా సంగీతం బాధ్యతలను తమన్ కి అప్పగించమని చెప్పినట్టుగా ఒక వార్త వినిపిస్తోంది. 

'సలార్' .. 'ప్రాజెక్టు K' తరువాత మారుతి దర్శకత్వంలో ప్రభాస్ 'రాజా డీలక్స్' చేయనున్నాడనే టాక్ వచ్చింది. అయితే అధికారిక ప్రకటన వెలువడవలసి ఉంది. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా తమన్ చేయనున్నాడని అంటున్నారు. ప్రభాస్ క్రేజ్ కి తగినట్టుగానే ఈ కథను తీర్చిదిద్దుతూ తన మార్క్ మిస్ కాకుండా మారుతి జాగ్రత్తలు తీసుకుంటున్నాడని చెబుతున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News