YS Sharmila: రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఉన్నాయని నిరూపిస్తే కేసీఆర్ రాజీనామా చేస్తారా?: షర్మిల

Sharmila challenges CM KCR

  • కేసీఆర్ కు షర్మిల సవాల్
  • తనతో పాటు పాదయాత్ర చేయాలని సవాల్
  • సమస్యలు లేకపోతే ముక్కు నేలకేసి రాస్తానన్న షర్మిల
  • క్షమాపణ చెప్పి పాదయాత్ర ఆపేస్తానని వెల్లడి

వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని, రాష్ట్రంలో ప్రజాసమస్యలు లేవని మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా ఆమె కేసీఆర్ కు సవాల్ విసిరారు. దమ్ముంటే కేసీఆర్ కూడా తనతో పాదయాత్రకు రావాలన్నారు. 

రాష్ట్రంలో సమస్యలు లేవని చెబితే ముక్కు నేలకేసి రాస్తానని, క్షమాపణలు చెప్పి పాదయాత్ర చేయకుండా వెళ్లిపోతానని షర్మిల తెలిపారు. ప్రజా సమస్యలు ఉన్నాయని నిరూపిస్తే కేసీఆర్ రాజీనామా చేసి దళితుడిని సీఎం చేస్తారా? అని ప్రశ్నించారు. 

బంగారు తెలంగాణ అంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని షర్మిల విమర్శించారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పోరాటం వల్లే ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడ్డాయని అన్నారు.

YS Sharmila
CM KCR
Pada Yatra
YSR Telangana Party
Telangana
  • Loading...

More Telugu News