Janasena: జ‌న‌సేన ఆవిర్భావ వేడుక‌ పోస్ట‌ర్ విడుద‌ల‌

janasena formation day poster released

  • ఈ నెల 14న జ‌న‌సేన ఆవిర్భావ వేడుక‌లు
  • మంగ‌ళ‌గిరిలోని ఇప్ప‌టంలో వేదిక‌
  • పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించిన నాదెండ్ల‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన త‌న ఆవిర్భావ వేడుక‌ల ఏర్పాట్ల‌లో పూర్తిగా నిమ‌గ్న‌మైపోయింది. పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ హైద‌రాబాద్‌లోనే ఉన్న‌ప్ప‌టికీ.. పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ ఈ ఏర్పాట్ల‌ను త‌న భుజ‌స్కందాల‌పై వేసుకున్నారు. ఇప్ప‌టికే పోలీసుల‌తో ఎలాగోలా స‌భ‌కు అనుమ‌తి సాధించిన నాదెండ్ల‌.. మంగ‌ళ‌గిరి ప‌రిధిలోని ఇప్ప‌టం గ్రామ పొలాల్లో పార్టీ ఆవిర్భావ వేడుక‌ల‌ను నిర్వ‌హించేందుకు రంగం సిద్ధం చేశారు.

పోలీసుల నుంచి అనుమ‌తి రాగానే.. స‌భా వేదిక నిర్మాణ ప‌నుల‌ను మొద‌లెట్టిన పార్టీ శ్రేణులు.. మిగిలిన ఏర్పాట్ల‌ను కూడా చురుగ్గా సాగిస్తున్నారు. ఈ నెల 14న జ‌ర‌గ‌నున్న పార్టీ ఆవిర్భావ వేడుక‌ల‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను నాదెండ్ల శుక్ర‌వారం రాత్రి ఆవిష్క‌రించారు.  గుబురు గ‌డ్డంతో కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉత్సాహంగా ప్ర‌సంగిస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫొటోతో ఈ పోస్ట‌ర్‌ను రూపొందించారు.

Janasena
Pawan Kalyan
Nadendla Manohar
Mangalagiri
  • Error fetching data: Network response was not ok

More Telugu News