Mamata Banerjee: ఇవి ఆ ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తాయన్న వాదనలు చెల్లవు: మమతా బెనర్జీ

Mamata Banerjee opines on assembly elections

  • నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయభేరి
  •  2024 ఎన్నికలతో ఈ ఫలితాలకు సంబంధంలేదన్న దీదీ
  • కాంగ్రెస్ సంయమనంతో వ్యవహరించాలని సూచన
  • అఖిలేశ్ మనోధైర్యం కోల్పోరాదని సలహా

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ ఫలితాలు చవిచూడడం పట్ల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన అభిప్రాయాలు పంచుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అందరం కలిసి పోటీ చేద్దామని కాంగ్రెస్ కోరుకుంటే, ఇప్పుడు తీవ్రంగా స్పందించడం మానుకోవాలని సలహా ఇచ్చారు. సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. 

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం బీజేపీకి నష్టదాయకమే అవుతుందని దీదీ సూత్రీకరించారు. 2024 ఎన్నికల ఫలితాలను ఈ 2022 ఎన్నికల ఫలితాలు నిర్దేశిస్తాయన్న వాదనలు చెల్లవని ఆమె స్పష్టం చేశారు. అటు, ఉత్తరప్రదేశ్ లో బీజేపీ భారీ విజయం సాధించడం పట్ల కూడా మమతా బెనర్జీ స్పందించారు. యూపీలో ఈవీఎం అక్రమాలు ముమ్మరంగా జరిగాయని ఆరోపించారు. 

ఏమైనా, ఈ ఫలితాలతో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మనోస్థైర్యం కోల్పోరాదని అన్నారు. అఖిలేశ్ యాదవ్ కు ఈసారి ఓటింగ్ పెరిగిందని, 27 శాతం నుంచి 37 శాతానికి పెరిగిందని వివరించారు. ఈవీఎం యంత్రాలకు ఫోరెన్సిక్ పరీక్షలు జరిపేలా అఖిలేశ్ ఎన్నికల సంఘాన్ని కోరాలని సూచించారు.

  • Loading...

More Telugu News