Komatireddy Venkat Reddy: కేసీఆర్ గారు త్వరగా కోలుకోవాలి: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komatireddy wishes KCR for speedy recovery

  • అస్వస్థత కారణంగా ఆసుపత్రిలో చేరిన కేసీఆర్
  • పలు టెస్టులు నిర్వహించిన వైద్యులు
  • కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని పార్టీలకు అతీతంగా అందరూ ఆకాంక్షించారు  

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థత కారణంగా హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. వైద్యులు ఆయనకు యాంజియోగ్రామ్, సీటీ స్కాన్, ఈసీజీ తదితర టెస్టులు నిర్వహించారు. అనంతరం వైద్యులు మాట్లాడుతూ కేసీఆర్ ప్రస్తుతం బాగున్నారని చెప్పారు. రక్త నాళాల్లో బ్లాక్స్ లేవని తెలిపారు. కొంత విశ్రాంతి తీసుకోవాలని సీఎంకు సూచించామని చెప్పారు. 

మరోవైపు కేసీఆర్ ఆసుపత్రిలో చేరారనే వార్తలు వచ్చిన వెంటనే సర్వత్ర ఆందోళన వ్యక్తమయింది. ఆయన త్వరగా కోలుకోవాలని రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ ఆకాంక్షిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Komatireddy Venkat Reddy
Congress
KCR
TRS
  • Loading...

More Telugu News