womens day: ఆ కామాంధుడు వైసీపీ నేతే.. నెల్లూరు ఘ‌ట‌న‌పై టీడీపీ ఆరోపణ

tdp tweet on rape attempton on britain lady in nellore district

  • మ‌హిళా దినోత్స‌వం నాడు బ్రిట‌న్ మ‌హిళ‌పై అత్యాచార య‌త్నం
  • నెల్లూరు జిల్లాలో ఘ‌ట‌న‌
  • నిందితుడు వైసీపీ నేతేన‌న్న టీడీపీ
  • ట్విట్ట‌ర్ వేదిక‌గా వివ‌రాల వెల్ల‌డి

అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ఓ వైపు ప్ర‌భుత్వం భారీ ఎత్తున వేడుక‌లు నిర్వ‌హిస్తుంటే.. మ‌రోవైపు నెల్లూరు జిల్లాలో బ్రిట‌న్ మ‌హిళ‌పై అత్యాచార య‌త్నానికి పాల్ప‌డిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు నాడే స్వ‌యంగా స్పందించారు. ఈ ఘ‌ట‌న‌తో ఏపీ ప‌రువే కాకుండా యావత్తు దేశం ప‌రువు పోయిందంటూ ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కూడా వేగంగానే స్పందించారు. అకృత్యానికి పాల్ప‌డ్డ నిందితుల‌ను అరెస్ట్ కూడా చేశారు.

తాజాగా ఈ ఘ‌ట‌న‌పై శుక్ర‌వారం టీడీపీ ఓ సంచ‌ల‌న ట్వీట్ చేసింది. నెల్లూరు జిల్లాలో బ్రిట‌న్ యువ‌తిపై అత్యాచార య‌త్నానికి పాల్ప‌డిన కామాంధుడు అధికార వైసీపీకి చెందిన నేతేన‌ని ఆ ట్వీట్‌లో ఆరోపించింది. ఈ మేర‌కు కాసేప‌టి క్రితం వ‌రుస ట్వీట్లు చేసింది. 

అత్యాచార య‌త్నానికి పాల్ప‌డ్డ వైసీపీ నేత పేరు అబిద్ అని, అత‌డు వైసీపీ ఎమ్మెల్యేల‌కు అనుచ‌రుడు అని కూడా టీడీపీ తెలిపింది. స్వయంగా వైసీపీ లీడర్లు ఇలా ఏపీని అత్యాచారాంధ్రప్రదేశ్ గా మారుస్తుంటే.. మరోవైపు జగన్ రెడ్డి తానేదో మహిళలను ఉద్ధరించేసినట్టు అసెంబ్లీలో అబద్ధపు ప్రసంగాలు చేస్తున్నారంటూ స‌ద‌రు ట్వీట్‌లో టీడీపీ విమర్శించింది. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News