నా స్నేహితుడు అరవింద్ కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు: సినీ నటుడు కమల్
- ఆప్ విజయం సాధించడంపై కమల్ స్పందన
- ఆప్ ఆవిర్భవించి పదేళ్లే అవుతోందన్న హీరో
- మరో రాష్ట్రంలోనూ విజయం సాధించడం ప్రశంసనీయమని వ్యాఖ్య
''ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు నా స్నేహితుడు అరవింద్ కేజ్రీవాల్ కు, ఆమ్ ఆద్మీ పార్టీకి శుభాకాంక్షలు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భవించిన పదేళ్లలోనే మరో రాష్ట్రం పంజాబ్‌లోనూ విజయం సాధించడం ప్రశంసనీయం'' అని కమలహాసన్ ట్వీట్ చేశారు.
కాగా, పంజాబ్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఢిల్లీలోలాగే పంజాబ్‌లోనూ అవినీతి రహిత పాలన అందిస్తామని ఆ పార్టీ నేతలు అంటున్నారు.