Andhra Pradesh: ఏపీ అసెంబ్లీలో గందరగోళం.. బడ్జెట్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన టీడీపీ

Heated arguments in AP budget sessions
  • అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన బుగ్గన
  • బడ్జెట్ లో అన్నీ తప్పులేనంటూ టీడీపీ సభ్యుల ఆందోళన
  • టీడీపీ సభ్యులపై స్పీకర్ ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టారు. ఆయన బడ్జెట్ ను చదువుతున్న సమయంలో టీడీపీ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. బడ్జెట్ లో అన్నీ అబద్ధాలే చెపుతున్నారని వారు మండిపడ్డారు. ఇది తప్పుల తడక బడ్జెట్ అని విమర్శించారు. మరోవైపు టీడీపీ సభ్యులపై వైసీపీ సభ్యులు ఎదురుదాడికి దిగారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. 

ఈ నేపథ్యంలో టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ ప్రసంగాన్ని అడ్డుకోవడం సరికాదని, ప్రసంగం ముగిసిన తర్వాత అభ్యంతరాలను చెప్పాలని అన్నారు. మరోవైపు ఆర్థికమంత్రి బుగ్గన మాట్లాడుతూ, ఇష్టం లేకపోతే సభ నుంచి వెళ్లిపోవాలని మండిపడ్డారు. ప్రస్తుతం గందరగోళం మధ్యే సభ కొనసాగుతోంది.
Andhra Pradesh
Budget Session
Telugudesam
YSRCP

More Telugu News