Telugudesam: టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన

tdp agitation in ap

  • ఆంధ్ర‌ప్ర‌దేశ్ బ‌డ్జెట్ స‌మావేశాల నేప‌థ్యంలో నిర‌స‌న‌
  • అసెంబ్లీకి నిరసన ర్యాలీగా బయలుదేరిన టీడీపీ నేత‌లు
  • ఏపీలో నెల‌కొన్న ఆర్థిక పరిస్థితుల‌పై టీడీపీ ఆందోళ‌న

ఆంధ్ర‌ప్ర‌దేశ్ బ‌డ్జెట్ స‌మావేశాల నేప‌థ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి నిరసన ర్యాలీగా బయలుదేరారు. ఏపీలో నెల‌కొన్న ఆర్థిక పరిస్థితుల‌పై వారు ఆందోళ‌న తెలిపారు. ఏపీ స‌ర్కారుకు ఆర్థిక క్రమశిక్షణ కొరవడిందని లోకేశ్ విమ‌ర్శ‌లు గుప్పించారు. కాగా, 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను ఏపీలో నేడు ప్ర‌వేశ పెట్ట‌నున్న‌ సాధారణ బడ్జెట్ కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. 

సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో ఈ రోజు ఉద‌యం జ‌రిగిన‌ మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకుంది. అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్‌ ప్రవేశపెడతారు. అనంత‌రం వ్యవసాయ అనుబంధ రంగాలపై బడ్జెట్‌ను మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టనున్నారు.

Telugudesam
Andhra Pradesh
AP Assembly Session
  • Loading...

More Telugu News