Mallu Bhatti Vikramarka: భట్టి వర్సెస్ కేటీఆర్... తెలంగాణ అసెంబ్లీలో వాగ్యుద్ధం

Bhatti Vs KTR in Telangana assembly

  • తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ పద్దుపై చర్చ
  • రేవంత్ ప్రస్తావన తెచ్చిన కేటీఆర్
  • సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడొద్దన్న భట్టి
  • సంస్కారం అనిపించుకోదని వ్యాఖ్యలు
  • భగ్గుమన్న టీఆర్ఎస్ సభ్యులు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మంత్రి కేటీఆర్ మధ్య వాగ్యుద్ధం నడిచింది. బడ్జెట్ పద్దుపై చర్చ సమయంలో కేటీఆర్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేశారు. అందుకు భట్టి విక్రమార్క అభ్యంతరం చెప్పారు. సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడడం సబబు కాదని అన్నారు. అది సంస్కారం అనిపించుకోదని కాస్తంత ఘాటుగానే వ్యాఖ్యానించారు. 

బీజేపీ నేతలు పోడియం వద్దకు వస్తే స్పీకర్ వారిని సస్పెండ్ చేశారని, అందుకు బీజేపీ అధ్యక్షుడి కంటే కాంగ్రెస్ అధ్యక్షుడే చాలా బాధపడుతున్నాడని కేటీఆర్... రేవంత్ పై పరోక్ష విమర్శలు చేశారు. దాంతో భట్టి స్పందిస్తూ, అసెంబ్లీలో లేని రేవంత్ రెడ్డి గురించి మాట్లాడడం భావ్యం కాదన్న ఉద్దేశంతోనే ఆయనపై వ్యాఖ్యలను ఖండించానని తెలిపారు. రేవంత్ రెడ్డి ఓ పార్లమెంటు సభ్యుడని, ఆయన గురించి అసెంబ్లీలో మాట్లాడడంపైనే అభ్యంతరం తెలియజేశానని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు.

భట్టి వ్యాఖ్యలతో టీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. పీసీసీ అధ్యక్షుడే సంస్కారం లేని వ్యక్తి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కేటీఆర్ అందుకుని... భట్టి విక్రమార్క చాలా మంచి వ్యక్తి అని, అయితే, ఆ పార్టీలో భట్టి హవా నడవడంలేదని, అక్కడ చాలామంది గట్టి విక్రమార్కలు ఉన్నారని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News