Pavan Kalyan: పవన్ తో మరో ప్రాజెక్ట్ సెట్ చేసిన త్రివిక్రమ్!

Pavan in Trivikram movie

  • పవన్, త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్
  • ఇద్దరి ఖాతాల్లో రెండు భారీ హిట్లు  
  • నాల్గో సినిమాకి సన్నాహాలు
  • వచ్చే ఏడాది సెట్స్ పైకి  

త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్ అనగానే అభిమానుల్లో ఒక రేంజ్ లో అంచనాలు ఉంటాయి. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇంతవరకూ 'జల్సా' .. 'అత్తారింటికి దారేది' .. 'అజ్ఞాతవాసి' సినిమాలు రాగా, మొదటి రెండు సినిమాలు కూడా భారీ విజయాలను నమోదు చేశాయి. వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా వచ్చే ఏడాది పట్టాలెక్కనుందనేది తాజా సమాచారం. 

పవన్ కీ .. త్రివిక్రమ్ కి మధ్య మంచి స్నేహం ఉంది. ఇటీవల వచ్చిన 'భీమ్లా నాయక్' సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే చేయడానికీ .. సంభాషణలు అందించడానికి .. ఒక పాట రాయడానికి కారణం ఆ స్నేహమే. అలాంటి ఈ ఇద్దరి కలయికలో మరో సినిమా రూపొందనుంది. ఆల్రెడీ త్రివిక్రమ్ లైన్ చెప్పడం .. పవన్ ఓకే అనడం జరిగిపోయాయట. 

అయితే ఈ నెల 18వ తేదీ నుంచి పవన్ 'హరి హర వీరమల్లు' తాజా షెడ్యూల్ షూటింగులో పాల్గొననున్నాడు. ఇప్పటికే ఈ సినిమా 50 శాతం చిత్రీకరణను జరుపుకుంది. ఆ తరువాత 'భవదీయుడు భగత్ సింగ్' కోసం హరీశ్ శంకర్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఆ వెంటనే సురేందర్ రెడ్డితో ఒక సినిమా చేయనున్నాడు. ఆ తరువాత త్రివిక్రమ్ ప్రాజెక్టు మొదలవుతుందట.

Pavan Kalyan
Trivikram Srinivas
Tollywood
  • Loading...

More Telugu News