Vijay Antony: 'బిచ్చగాడు' ఫేమ్ విజయ్ ఆంటోని హీరోగా 'హత్య'

Hathya movie update

  • 'బిచ్చగాడు' సినిమాతో క్రేజ్ 
  • తరువాత కలిసిరాని సినిమాలు 
  • మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తాజా చిత్రం 
  • ముఖ్య పాత్రల్లో మీనాక్షి .. రితిక సింగ్  

విజయ్ ఆంటోని పేరు వినగానే ఎవరికైనా 'బిచ్చగాడు' సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలో ఆయన సహజమైన నటన కళ్లముందు కదలాడుతుంది. ఈ సినిమా తరువాత తన సినిమాలను తమిళంతో పాటు తెలుగులోను రిలీజ్ చేశాడుగానీ ఆ స్థాయిలో ఆయనకి విజయాలు దక్కలేదు. అయితే ఆయన సినిమాలు విభిన్నంగా ఉంటాయనే పేరు మాత్రం వచ్చింది. 

ఆయన తాజా చిత్రంగా తమిళంలో 'కొలై' రూపొందింది. తెలుగులో 'హత్య' టైటిల్ తో విడుదల కానుంది. టైటిల్ ను బట్టి ఈ కథ ఒక హత్య చుట్టూ తిరుగుతుందనే విషయం అర్థమవుతూనే ఉంది. యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా నిర్మితమైంది. కమల్ బొహ్ర .. ధనుంజయన్ .. ప్రదీప్ నిర్మించిన ఈ సినిమాకి బాలాజీ కుమార్ దర్శకత్వం వహించాడు. 

ఒక యువతి హత్యకి గురవుతుంది .. ఆ హత్యా నేరంలో ఐదుగురి ప్రమేయం ఉంటుంది. వాళ్లను కనిపెట్టి పట్టుకునే డిటెక్టివ్ వినాయక్ పాత్రను విజయ్ ఆంటోని పోషించాడు. ఆయనకి సహకరించే పాత్రలో రితిక సింగ్ కనిపించనుంది. ఇతర ముఖ్య పాత్రల్లో మీనాక్షి చౌదరి .. రాధిక .. మురళీశర్మ కనిపించనున్నారు.

Vijay Antony
Meenakshi Choudary
Rithika Singh
Hathya Movie
  • Loading...

More Telugu News