వైసీపీ ఎమ్మెల్యేపై టీడీపీ మహిళా నేత తీవ్ర వ్యాఖ్యలు
- అనిత కేరెక్టర్‌పై ప్రసన్న కామెంట్లు
- ప్రసన్నపై విరుచుకుపడ్డ అనిత
- ఇంటికొచ్చి తాట తీస్తానని హెచ్చరిక
- హైదరాబాద్‌లోని ఇంటిని ఎవరికి రాసిచ్చావని ప్రశ్న
తన కేరెక్టర్ గురించి మరోమారు మాట్లాడితే ప్రసన్నకుమార్ రెడ్డి చరిత్ర మొత్తం మీడియా ముందు పెడతానంటూ అనిత హెచ్చరించారు. ప్రసన్నకుమార్ రెడ్డి మాటలకు, బెదిరింపులకు భయపడేది లేదని ఆమె తేల్చి చెప్పారు. చంద్రబాబు సీఎం కాగానే.. వైసీపీ నేతల ఇళ్లకు వెళ్లి వారికి బడిత పూజ చేస్తామని అనిత మరో సంచలన వ్యాఖ్య చేశారు. ప్రసన్నకుమార్ రెడ్డి హైదరాబాద్‌లోని తన ఇంటిని ఎవరికి రాసిచ్చారో దమ్ముంటే చెప్పాలని ఆమె సవాల్ విసిరారు.