Congress: వ‌య‌నాడ్‌లో రాకెట్‌ ప‌ట్టిన రాహుల్ గాంధీ

rahul gandhi plays shuttle in wayanad

  • వ‌య‌నాడ్ ప‌ర్య‌ట‌న‌లో రాహుల్ గాంధీ
  • స‌ర‌దాగా ష‌టిల్ ఆడిన కాంగ్రెస్ నేత‌
  • వ‌య‌నాడ్ ప్ర‌జ‌ల‌తో మ‌మేకం

కాంగ్రెస్ పార్టీ కీల‌క నేత‌, వ‌య‌నాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రస్తుతం త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు. ఒక రోజు ప‌ర్య‌ట‌న నిమిత్తం బుధ‌వారం ఉద‌యం వ‌య‌నాడ్ చేరుకున్న రాహుల్ గాంధీ నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఓ ఇండోర్ స్టేడియానికి వెళ్లిన రాహుల్ గాంధీ.. అక్క‌డి ష‌టిల్ బ్యాడ్మింట‌న్ కోర్టులో ష‌టిల్ రాకెట్ చేత‌బ‌ట్టారు. స‌ర‌దాగా ష‌టిల్ ఆడుతూ క‌నిపించారు. ఈ మేర‌కు ష‌టిల్ అడుతున్న‌ రాహుల్ గాంధీ వీడియోను కాంగ్రెస్ పార్టీ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది.

 

  • Loading...

More Telugu News