YSRCP: ముంద‌స్తుతో మూడేది మీకే!.. బాబుపై విజయసాయిరెడ్డి సెటైర్లు!

vijay sai reddy hits back on chandrababu comments
  • ముందస్తు దిశ‌గా వైసీపీ అంటూ చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు
  • చంద్ర‌బాబు కామెంట్ల‌ను తిప్పికొట్టిన సాయిరెడ్డి
  • టీడీపీ ప్ర‌తిప‌క్ష హోదాకే ముప్పు అంటూ హెచ్చరిక‌
ఏపీలో అధికార పార్టీ వైసీపీ త‌న‌పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేకత అంత‌కంత‌కూ పెరుగుతున్న వైనాన్ని గుర్తించిందనీ, అందుకే త‌ప్ప‌నిస‌రిగా ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే దిశ‌గా ఆలోచ‌న చేస్తోంద‌ని విప‌క్ష టీడీపీ గ‌త కొంత‌కాలంగా ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ఈ విష‌యంపై టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు కూడా ప‌లుమార్లు మాట్లాడారు. 

తాజాగా అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని నిన్న కూడా ఆయ‌న దీనిపై మాట్లాడారు. చంద్రబాబు వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్‌గా వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పార్ల‌మెంటులో ఆ పార్టీ నేత‌గా ఉన్న విజ‌య‌సాయిరెడ్డి సెటైర్లు సంధించారు.

"త్వరలోనే ముందస్తు ఎన్నికలు వస్తాయి... మళ్లీ తాను ముఖ్యమంత్రిని కావడం ఖాయమని చంద్రబాబు ప్రగల్భాలు. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరక్క నానా అగచాట్లు పడ్డ వాస్తవం మరచిపోయి ఇప్పుడు పగటికలలు కంటున్నారు. గెలుపు దేవుడెరుగు. ముందస్తు వస్తే ఈసారి మీ ప్రతిపక్షహోదాకే మూడుతుంది బాబూ" అంటూ సాయిరెడ్డి ఎద్దేవా చేశారు. 
YSRCP
Vijay Sai Reddy
TDP
Chandrababu

More Telugu News