SEBI: ఎల్ఐసీ ఐపీవోకి సెబీ అనుమతి!

SEBI Okays LIC IPO

  • దరఖాస్తు చేసుకున్న 22 రోజులకు అనుమతి
  • ప్రభుత్వం అనుమతివ్వడమే తరువాయి
  • ఏప్రిల్ 1న ఇష్యూకు వచ్చే అవకాశం
  • 5 శాతం షేర్లను అమ్మనున్న ప్రభుత్వం

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ఐపీవోకి రంగం సిద్ధమైపోయింది. ఐపీవోకి మార్కెట్ రెగ్యులేటరీ బోర్డు 'సెబీ' ఓకే చెప్పేసింది. దానికి సంబంధించి అబ్జర్వేషన్ లెటర్ ను జారీ చేసింది. ఐపీవోకు దరఖాస్తు చేసిన 22 రోజుల్లోనే సెబీ ఓకే చెప్పడం గమనార్హం. మామూలుగా అయితే సెబీ అనుమతిచ్చేందుకు 30 నుంచి 40 రోజుల సమయం పడుతుంది. కానీ, ఎల్ఐసీకి చాలా త్వరగా అనుమతులు రావడం విశేషం. ఇక, ప్రభుత్వ అనుమతులు రావడమే తరువాయి. 

ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ 1న ఐపీవోను ఇష్యూ చేసేందుకు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెలలోనే రూ.60 వేల కోట్ల విలువ చేసే ఐదు శాతం వాటాను ప్రభుత్వం అమ్మనున్నట్టు తెలుస్తోంది. ఐపీవోలో భాగంగా 31,62,49,885 ఈక్విటీ షేర్లను పబ్లిక్ ఆఫరింగ్ కు ఎల్ఐసీ పెట్టనుంది. అందులో 50 శాతం షేర్లను క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషన్ బయ్యర్లకు కేటాయించనుంది. మరో 15 శాతం షేర్లను నాన్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్లకు కేటాయించనున్నారు.

  • Loading...

More Telugu News