Imran Khan: ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయాలంటూ పాకిస్థాన్ లో విపక్షాల భారీ ప్రదర్శన
- పీపీపీ ఆధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీల ప్రదర్శన
- ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయిందని విమర్శ
- 24 గంటల్లో రాజీనామా చేయాలని డిమాండ్
ఇమ్రాన్ ఖాన్ పాలనలో పాకిస్థాన్ పరిస్థితి దారుణంగా తయారయిందని ఆరోపిస్తూ.. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారిందని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా పీపీపీ నాయకుడు భిలావల్ భుట్టో మాట్లాడుతూ దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయిందని విమర్శించారు. విదేశీ మారకద్రవ్యం నిలువలు క్షీణిస్తున్నాయని ఆరోపించారు. 24 గంటల్లో ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయాలని... లేనిపక్షంలో పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.