Volodymyr Zelensky: ఇది కీవ్ నగరం అంటే ఎవరూ గుర్తుపట్టలేరు: జెలెన్ స్కీ తీవ్ర ఆవేదన

Zelensky says Russian troops destroys Kyiv

  • అమెరికా టీవీ చానల్ కు ఇంటర్వ్యూ
  • నగరాలను రష్యా ధ్వంసం చేస్తోందన్న జెలెన్ స్కీ
  • పాశ్చాత్య దేశాలు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి
  • 'నో ఫ్లై జోన్' పై పునరాలోచించాలని వినతి

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ ఓ అమెరికా టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రష్యా దాడుల్లో ఉక్రెయిన్ నగరాలు దారుణంగా దెబ్బతిన్నాయని ఆక్రోశించారు. రాజధాని కీవ్ నగరం గుర్తుపట్టలేనంతగా నాశనం అయిందని తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. రాజధాని నగరాన్ని ఇప్పుడు చూసిన వారు ఇది కీవ్ అంటే నమ్మలేరని తెలిపారు. రష్యా కేవలం రాజధాని కీవ్ పై మాత్రమే కాకుండా, శివారు ప్రాంతాల్లోనూ, జనావాస ప్రాంతాలపైనా బాంబులు వేస్తోందని జెలెన్ స్కీ ఆరోపించారు. 

రష్యా దళాలు తమ నగరాలను ఆక్రమించుకున్నప్పటికీ ఉక్రెయిన్ ప్రజలు ఎదురొడ్డి పోరాడుతున్నారని, అయితే ఇది ఎంతకాలం కొనసాగుతుందన్నది ప్రశ్నార్థకం అని అన్నారు. పాశ్చాత్యదేశాలు ఉక్రెయిన్ కు మద్దతు ఇవ్వాలని జెలెన్ స్కీ మరోసారి విజ్ఞప్తి చేశారు. రష్యా తన ఫైటర్ జెట్లు, పోరాట హెలికాప్టర్ లను ఉక్రెయిన్ గగనతలం నుంచి దాడులు చేయకుండా నిషేధించాలని, నో ఫ్లై జోన్ ప్రకటించడంపై పాశ్చాత్య దేశాలు మరోసారి ఆలోచించాలని కోరారు.

  • Loading...

More Telugu News