CPI Narayana: ఏపీ గ‌వ‌ర్న‌ర్‌పై సీపీఐ నారాయణ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

cpi narayana derogatory comments on ap governer

  • జ‌గ‌న్‌కు హెడ్ క్ల‌ర్క్‌గా గ‌వ‌ర్న‌ర్‌
  • ఇలాంటి వారి వ‌ల్ల వ్య‌వ‌స్థ‌పైనే న‌మ్మ‌కం పోతోంది
  • సీపీఐ నారాయ‌ణ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ మ‌రో వివాదాన్ని రేపారు. ఏపీ గ‌వ‌ర్న‌ర్‌గా కొన‌సాగుతున్న బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌తో పాటు ఏకంగా మొత్తం గ‌వ‌ర్న‌ర్ల వ్య‌వ‌స్థ మీదే ఆయ‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం గుంటూరులో మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా అలా నారాయ‌ణ నోట నుంచి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు ప్ర‌వాహంలా వ‌చ్చేశాయి.

ఏపీ గ‌వ‌ర్న‌ర్ హ‌రిచంద‌న్, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి హెడ్ క్ల‌ర్క్‌గా మారిపోయార‌ని నారాయ‌ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ గ‌వ‌ర్న‌ర్‌గా కొన‌సాగుతున్న హ‌రిచంద‌న్ లాంటి వారి వ‌ల్ల మొత్తం వ్య‌వ‌స్థ‌పైనే న‌మ్మ‌కం పోతోంద‌ని కూడా నారాయ‌ణ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు.

CPI Narayana
ap governer
Biswabhusan Harichandan
  • Loading...

More Telugu News