breast surgery: బాలీవుడ్ ఎంట్రీ కోసం బ్రెస్ట్ సర్జరీ చేయించుకున్నా..: రాఖీ సావంత్

 underwent breast surgery when I was 15 years old
  • అప్పుడు నా వయసు 15-16 ఏళ్లు
  • సరైన ఆకృతిలో లేను
  • బాలీవుడ్ అవకాశాలు రావాలంటే సరిగ్గా ఉండాలన్నారు
  • సర్జరీతో హాట్ గర్ల్ గా మారానన్న రాఖీ
రాఖీ సావంత్ ఎన్నో ప్లాస్టిక్ సర్జరీలతో తన శరీరాన్ని ఓ ప్రయోగశాలగా మార్చుకున్న నటి. లైపో సక్షన్ నుంచి బ్రెస్ట్ ఇంప్లాంట్ వరకు ఆమె చేయని ప్రయత్నం అంటూ లేదు. హాట్ హాట్ గా కనిపించాలని, అవకాశాలను సొంతం చేసుకోవాలని పడ్డ ఆరాటం ఆమెతో అలాంటి రిస్కులు చేయించింది. ఇలాంటి సర్జరీ ప్రయత్నాలు బెడిసి కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా తన జీవితంలో భయంకరమైన ఒక సందర్భాన్ని ఆమె తాజాగా ఓ వార్తా సంస్థతో పంచుకుంది. 

‘‘నాకు 15-16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు బ్రెస్ట్ సర్జరీ (వక్షోజాలకు సంబంధించిన శస్త్రచికిత్స) చేయించుకున్నాను. అది నన్ను ఎంతో భయపెట్టింది. నేను బాలికను కావడంతో వక్షోజాల ఆకృతి సరైన రీతిలో లేదు. అదే సమయంలో బాలీవుడ్ లో చోటు సంపాదించాలని కలలుకన్నాను. ఆ సమయంలో మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ లు సైతం సర్జరీలు చేయించుకుంటున్నారు. బాలీవుడ్ లోకి రావాలనుకుంటే ముఖం, శరీరం చక్కని ఆకృతిలో ఉండాలని అందరూ నాకు చెప్పారు. ఆ సమయంలో నేను సంపూర్ణ ఆకృతిలో లేను. అందుకే ఆపరేషన్ సాయంతో కూల్ అమ్మాయి నుంచి హాట్ అమ్మాయిగా మారాను’’ అంటూ రాఖీ సావంత్ చెప్పుకొచ్చింది. 
breast surgery
rakhi sawant
actor

More Telugu News