Raviteja: పాటల కోసం స్పెయిన్ లో 'రామారావ్ ఆన్ డ్యూటీ'!

Ramarao On Duty movie update

  • యాక్షన్ ఎంటర్టైనర్ గా 'రామారావు ఆన్ డ్యూటీ'
  • రవితేజ సరసన నాయికలుగా ఇద్దరు భామలు
  • ఈ సినిమాతో సీనియర్ హీరో వేణు రీ ఎంట్రీ 
  • మరో మూడు సినిమాలను లైన్లో పెట్టిన రవితేజ

రవితేజ తన కెరియర్లో చాలామంది కొత్త దర్శకులను పరిచయం చేశాడు. అలాగే తన తాజా చిత్రమైన 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాతో, శరత్ మండవను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు. డిప్యూటీ కలెక్టర్ గా రవితేజ కనిపించే ఈ సినిమాలో ఆయన సరసన నాయికలుగా దివ్యాన్ష కౌశిక్ - రజీషా విజయన్ నటిస్తున్నారు. 

ఈ సినిమాకి సామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఆయన స్వరపరిచిన పాటలలో కొన్నిటిని చిత్రీకరించడానికి ఈ సినిమా టీమ్ 'స్పెయిన్' ను ఎంచుకుంది. అక్కడి అందమైన లొకేషన్స్ లో పాటలను చిత్రీకరించడానికి టీమ్ వెళ్లింది. పాటలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని శరత్ మండవ చెబుతున్నాడు.

సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాతో, సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఇతర ముఖ్యమైన పాత్రలలో నాజర్ .. నరేశ్ .. తనికెళ్ల భరణి .. పవిత్ర లోకేశ్ కనిపించనున్నారు. ఈ సినిమా తరువాత ప్రాజెక్టులుగా రవితేజ 'ధమాకా' .. 'రావణాసుర' .. 'టైగర్ నాగేశ్వరరావు'ను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే.

Raviteja
Divyansha
Rajeesha
Ramarao On Duty Movie
  • Loading...

More Telugu News