Telugudesam: జగన్... అచ్చెన్నాయుడు మధ్య సరదా సంభాషణ

Funny conversation between Jagan and atchannidu

  • స్పీకర్ సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం
  • అచ్చెన్నాయుడు వస్తుండగా ‘అచ్చెన్న కమింగ్ బ్యాక్’ అన్న జగన్
  • ‘అసెంబ్లీ ఉన్నప్పుడు రావాలిగా’ అన్న అచ్చెన్న
  • సమావేశంలో విరిసిన నవ్వులు

ఏపీ అసెంబ్లీలో నిన్న గందరగోళ పరిణామాలు చేటుచేసుకున్న తర్వాత నిర్వహించిన బీఏసీ సమావేశంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య నవ్వులు విరబూసే ఘటన చోటుచేసుకుంది. బీఏసీ సమావేశంలో ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మధ్య సరదా సంభాషణ చోటుచేసుకుంది. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన శాసనసభ బీఏసీ గదిలో సమావేశం నిర్వహించారు. 

గదిలోకి అచ్చెన్నాయుడు ప్రవేశిస్తున్న సమయంలో ‘‘అచ్చెన్న కమింగ్ బ్యాక్’’ అంటూ జగన్ సరదాగా వ్యాఖ్యానించారు. దీనికి వెంటనే స్పందించిన అచ్చెన్న.. ‘‘అసెంబ్లీ ఉన్నప్పుడు రావాలి కదా’’.. ఇందులో కమింగ్ బ్యాక్ ఏముంది? అనగానే అక్కడున్న వారందరూ నవ్వేశారు.

Telugudesam
YSRCP
Assembly
Jagan
BAC Meeting
Atchannaidu
  • Loading...

More Telugu News