V Srinivas Goud: తన హత్యకు కుట్ర కేసుపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏమన్నారంటే...!
- మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర
- భగ్నం చేసిన సైబరాబాద్ పోలీసులు
- కేసు కోర్టు పరిధిలో ఉందని వ్యాఖ్య
- అందుకే మాట్లాడడంలేదని వివరణ
- రాష్ట్ర పోలీసుల సమర్థతపై నమ్మకం ఉందని వ్యాఖ్యలు
తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు రూ.15 కోట్లకు ఒప్పందం జరిగిందంటూ ఇటీవల తెలంగాణ పోలీసులు సంచలన కుట్రను బట్టబయలు చేశారు. ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ తొలిసారిగా స్పందించారు. అయితే ఈ కేసు ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున ఎలాంటి అభిప్రాయాలు వెల్లడించలేనని అన్నారు. తెలంగాణ పోలీసుల సమర్థతపై తనకు నమ్మకం ఉందని, పలు క్లిష్టమైన కేసులను ఛేదించిన ఘనత వారి సొంతమని పేర్కొన్నారు. దేశంలోనే తెలంగాణ పోలీసులకు మంచి పేరుందని అన్నారు.