Prabhas: ఒకటికాదు .. రెండు కాదు .. 'రాధేశ్యామ్' కోసం 101 భారీ సెట్లు!

Radhe Shyam movie update

  • రొమాంటిక్ లవ్ స్టోరీగా 'రాధే శ్యామ్'
  • ఇటలీ నేపథ్యంలో సాగే ప్రేమకథ 
  • ఆర్ట్ డైరెక్టర్ గా రవీందర్ రెడ్డి 
  • ఈ నెల 11వ తేదీన సినిమా రిలీజ్   

సాధారణంగా ఒక సినిమా కోసం ఒకటి రెండు భారీ సెట్లు వేయడం జరుగుతూ ఉంటుంది. గ్రామీణ నేపథ్యంలో సినిమాను తెరకెక్కించేటప్పుడు విలేజ్ సెట్ ను వేయిస్తుంటారు. అలా 'రంగస్థలం' సినిమా కోసం విలేజ్ సెట్ వేయించినందుకే కోట్ల రూపాయల ఖర్చు అయింది. అలాంటిది 'రాధే శ్యామ్' కోసం ఇటలీ నేపథ్యంతో కూడిన సెట్స్ వేశారు. 

ఈ కథ ఇటలీ నేపథ్యంలో నడుస్తుంది. అందువలన ఈ సినిమా టీమ్ మేజర్ షెడ్యూల్ షూటింగు కోసం ఇటలీ వెళ్లింది. అయితే కరోనా కారణంగా మధ్యలోనే ఇండియాకి వచ్చేయవలసి వచ్చింది. కరోనా పరిస్థితులపై పరిశీలన చేసి, హైదరాబాద్ లోనే ఇటలీ నేపథ్యంతో కూడిన సెట్స్ వేసి షూటింగు పూర్తిచేయాలని నిర్ణయించుకున్నారు. 

అలా హైదరాబాద్ లో ఇటలీ నేపథ్యంలో సెట్ల నిర్మాణం మొదలైంది. ఈ సినిమా కోసం మొత్తం 101 సెట్లను వేయడం జరిగిందని ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి చెప్పారు. అయితే ఎక్కడా కూడా ఇది ఇటలీ కాదు అనే ఆలోచన రాదని ఆయన చెప్పారు. సెట్ వర్క్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు. ఈ నెల 11వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

Prabhas
Pooja Hegde
Radha Krishna Kumar
Radhe Shyam Movie
  • Loading...

More Telugu News